బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ తహతహ
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:15 AM
బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ తహతహలాడుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు.
అందుకే చంద్రబాబుపై కేటీఆర్, హరీశ్ పొగడ్తలు: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ తహతహలాడుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతోనూ సయోధ్యకు ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే చంద్రబాబును ప్రసన్నం చేసుకునే యత్నాల్లో కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఏ నోటితోనైతే చంద్రబాబును వారు అనరాని మాటలు అన్నారో.. అదే నోటితో ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే వెంటనే రెండు పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు.
మియాపూర్ భూములపైన సుప్రీం కోర్టు తీర్పు మాజీ సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. రూ.50 వేల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. హరీశ్‌రావును కాళేశ్వరం గేట్లకు కట్టేసి కొట్టినా తప్పు లేదని ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ప్రభుత్వ భూములను కుటుంబ సభ్యులు, అనుచరులకు కట్టబెట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదైతే.. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించిన ఘనత తమ ప్రజాప్రభుత్వానిదని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సుల్లో ఢిల్లీకి తరలిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News