రేవంత్ జల ద్రోహానికి ఇదే సాక్ష్యం
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:13 AM
సీఎం రేవంత్ జల ద్రోహానికి కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావన లేకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్: హరీశ్
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్ జల ద్రోహానికి కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు రేవంత్ పెద్దపీట వేస్తున్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేఈఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్‌ను ఆయన పోస్టు చేశారు. నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్లపై నిలదీయకుండా ద్రోహం చేశారని, నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో కృష్ణాజలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రశ్నించకుండా మోసం చేశారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తీరు ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని పేర్కొన్నారు. సాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌గ్రిడ్ గురించి ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేఆర్‌ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లు చెబుతుండగా.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై మేధావులు, తెలంగాణవాదులు ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్న రేవంత్‌ను తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News