Share News

19 నుంచి హరీశ్‌ రాజకీయ పతనం: చనగాని

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:35 AM

సిద్దిపేటలో ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న సభతో రాజకీయంగా హరీశ్‌రావు పతనం ప్రారంభం కానుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ పేర్కొన్నారు.

19 నుంచి  హరీశ్‌ రాజకీయ పతనం: చనగాని
Changanai Dayakar

  • ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడుగుపెట్టనివ్వం: వీహెచ్‌

హైదరాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సిద్దిపేటలో ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న సభతో రాజకీయంగా హరీశ్‌రావు పతనం ప్రారంభం కానుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావుకు డిపాజిట్‌ కూడా దక్కదని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిందే తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.


కోటి మంది మహిళల దీవెనలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటనను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే.. ఢిల్లీ నుంచి వచ్చే ఆ పార్టీ నేతలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు హెచ్చరించారు. జనగణనలో ఓబీసీ గణన ఎందుకు చేర్చలేదో చెప్పాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:35 AM