గణేశ్ నిమజ్జనానికి 700 ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Sep 25 , 2026 | 10:25 AM
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఆర్‌టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ సిటీ: గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఆర్‌టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. ట్రాఫిక్ డైవర్షన్‌ల కోసం 44 ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్ల నియామకం చేపట్టింది.
ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీ్‌సలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. బ్రేక్ డౌన్ వాహనాల మరమత్తు కోసం 118 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News