గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:02 PM
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా హైదరాబాద్ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్-2047తో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా హైదరాబాద్ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్-2047తో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన WEF సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఏఐతో పౌరసేవలు మరింత సమర్థవంతం అవుతాయని వెల్లడించారు. ఏఐతో తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. సబ్సిడీలు, ఆస్తి పన్నులు, సంక్షేమ పథకాల అమల్లో ఏఐ వినియోగం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. పట్టణ, మున్సిపల్ సమస్యల పరిష్కారంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ పెరుగుతోందని వివరించారు. సరైన దిశలో ఏఐ వినియోగిస్తే పాలన మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఫ్యాక్టరీలపై గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ చర్చించారు.
సీఎం రేవంత్‌రెడ్డితో ఎక్స్‌పర్టైజ్ సీఈఓ భేటీ
దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో ఎక్స్‌పర్టైజ్ సీఈఓ భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ‘ఎక్స్‌పర్టైజ్’ ఆసక్తి కనబరిచింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీని మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2047 విజన్‌కు అనుగుణంగా భవిష్యత్ ప్రతిభా కేంద్రంగా తెలంగాణ మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై యూనిలీవర్ ఆసక్తి
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై యూనిలీవర్ ఆసక్తి చూపించింది. దావోస్‌లో తెలంగాణ రైజింగ్ బృందంతో యూనిలీవర్ టాప్ అధికారులు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జీసీసీ అవకాశాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల హబ్‌గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News