Share News

పార్టీ సంబంధం ఎంతో గొప్పది

ABN , Publish Date - Feb 25 , 2026 | 09:49 AM

రక్త సంబంధం కన్నా పార్టీ సంబంధం ఎంతో గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాషాయ వర్గంలో ఒక కార్యకర్తకు ఆపద వస్తే మిగతా వారందరూ అండగా నిలుస్తారని ఆయన అన్నారు.

పార్టీ సంబంధం ఎంతో గొప్పది

  • ఎంపీ ఈటల

సికింద్రాబాద్: రక్త సంబంధం కన్నా పార్టీ సంబంధం ఎంతో గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాషాయ వర్గంలో ఒక కార్యకర్తకు ఆపద వస్తే మిగతా వారందరూ అండగా నిలుస్తారని ఆయన అన్నారు. బీజేపీ మేడ్చల్‌ మల్కాజిగిరి అర్బన్‌ జిల్లా కార్యకర్తల శిక్షణ శిబిరంతో పాటు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌ కార్యక్రమాన్ని మంగళవారం మల్కాజిగిరిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యలపై కోట్లాడినప్పుడే ప్రజలకు, నాయకులకు మధ్య అనుబంధం ఏర్పడుతుందన్నారు.


city6.2.jpgప్రజలకు న్యాయం చేయడమే భారతీయ జనతాపార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పార్టీ బలోపేతం దిశగా నాయకులు, కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని ఎంపీ ఈటల రాజేందర్‌ కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్‌జీ, ఫణీంద్ర, విఠల్‌రావు, రమేష్‌, పద్మ, బాలచందర్‌గౌడ్‌, మల్లారెడ్డి, రామకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవుడు క్షమించడు!

రైలు ప్రయాణికులకు రివార్డులు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2026 | 09:49 AM