Share News

కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Feb 25 , 2026 | 08:26 AM

టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ ప్రాంతంలో సింథటిక్‌ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేపట్టింది.

కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ ప్రాంతంలో సింథటిక్‌ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేపట్టింది. సనత్‌నగర్‌ పోలీసులతో కలిసి చేపట్టిన దాడిలో ఫతేనగర్‌లో నివాసం ఉంటున్న జగన్నాథ్‌ బిష్ణోయ్‌(33) టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జగన్నాథ్‌ బిష్ణోయ్‌ అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు అంగీకరించాడు.


అతడు కోకోపీట్‌ (కొబ్బరి పీచు పొడి)ను కొనుగోలు చేసి, అందులోని వ్యర్థాలను తొలగించి, వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజులపాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి ‘సన్‌సెట్‌ ఎల్లో’ మరియు ‘టార్ట్రాజైన్‌ ఆరెంజ్‌’ వంటి సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.


city4.2.jfifఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్‌, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్‌, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ను మిక్స్‌ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాడుల్లో నిందితుడి నుంచి రంగు కలిపిన టీ పొడి 120 కిలోలు,


సహజమైన టీ పొడి 30 కిలోలు, కోకోపీట్‌ మిశ్రమం 138 కిలోలు, తూకం యంత్రం, సన్‌సెట్‌ ఎల్లో కలర్‌ 800 గ్రాములు, 12 బెల్లం బాక్స్‌లతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల నుంచే కొనుగోలు చేయాలని, ఆహార కల్తీకి సబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవుడు క్షమించడు!

రైలు ప్రయాణికులకు రివార్డులు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2026 | 08:26 AM