Share News

కల్లం మోడ్రన్ రైస్ మిల్స్‌కు ఈడీ షాక్.. రూ.18.33 కోట్ల ఆస్తులు అటాచ్

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:10 PM

కల్లం మోడ్రన్ రైస్ మిల్స్ కేసులో ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. కల్లం పేరిరెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆస్తులపై ఈడీ కొరడా ఝుళిపించారు. రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

కల్లం మోడ్రన్ రైస్ మిల్స్‌కు ఈడీ షాక్.. రూ.18.33 కోట్ల ఆస్తులు అటాచ్
Kallam Modern Rice Mills Case

హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కల్లం మోడ్రన్ రైస్ మిల్స్ కేసులో (Kallam Modern Rice Mills Case) ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. కల్లం పేరిరెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆస్తులపై కొరడా ఝుళిపించారు. రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆస్తులను జప్తు చేశారు. బ్యాంకు రుణాల మోసం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చర్యలు తీసుకున్నారు. 2010 - 2013 మధ్య ఎస్‌బీహెచ్ నుంచి రూ.24.57 కోట్ల రుణాలను ఈ గ్రూపు సంస్థలు పొందిన విషయం తెలిసిందే. నకిలీ, ఫోర్జరీ ఆస్తిపత్రాలను తనఖాగా కల్లం మోడ్రన్ రైస్ మిల్స్ పెట్టి రుణాలు పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.


బ్యాంకుకు రూ.18.33 కోట్ల నష్టం కలిగించినట్లు కల్లం మోడ్రన్ రైస్ మిల్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. కల్లం మోడ్రన్ రైస్ మిల్స్, శ్రీ రామబ్రహ్మ మోడ్రన్ రైస్ మిల్స్, శ్రీ వినాయక ట్రేడర్స్ పేరుతో రుణాలు తీసుకున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. బంధువులు, ఉద్యోగులు, అనుచరుల పేర్లతో సుమారు 26 సంస్థలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మూడు సంస్థల క్యాష్ క్రెడిట్ ఖాతాల నుంచి రూ.23.81 కోట్ల నగదును ఉపసంహరించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. కార్మికులు, అకౌంటెంట్లు, కల్లం పేరిరెడ్డి పేర్లతో నగదు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. రుణాల సొమ్ముతోనే పలు స్థిరాస్తులను కొనుగోళ్లు చేసినట్లు దర్యాప్తులో ఈడీ అధికారులు వెల్లడించారు. బంధువులు, అనుచరుల పేర్లకు ఎలాంటి నగదు చెల్లించకుండానే ఆస్తులను బదిలీ చేసినట్లు తెలిపారు. నామమాత్రపు యజమానులుగా బంధువులు.. అసలు లబ్ధిదారుగా కల్లం పేరిరెడ్డి ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.


ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల వివరాలిలా..

  • మొత్తం 50 స్థిరాస్తుల విలువ రూ.16.88 కోట్లు.

  • 5 ఫ్లాట్ల విలువ రూ.1.45 కోట్లు.

  • మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.18.33 కోట్లు.

  • చెన్నై సీబీఐ ఈఓడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు

స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 01:30 PM