తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు ఈసీ ఆమోదం
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:39 PM
తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల (Telangana Polling Stations) హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదించింది. కొన్ని పోలింగ్ స్టేషన్ల తొలగింపు, విలీనానికి కూడా అనుమతి ఇచ్చింది. ఆయా జిల్లాల వారీగా పోలింగ్ స్టేషన్ల మార్పుల జాబితాను ఈసీ విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పునకు కూడా ఆమోదించింది. ఈ మార్పుల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సీఈఓ కార్యాలయం ఈరోజు(బుధవారం) మెమో జారీ చేసింది.
వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల
POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News