వారం రోజులుగా కలుషిత నీటి సరఫరా
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:43 AM
హైదరాబాద్ గోషామహల్ సెక్షన్ పరిధిలో వారం రోజులుగా కలుషిత నీటి సరఫ రా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
హైదరాబాద్: గోషామహల్ సెక్షన్ పరిధిలో వారం రోజులుగా కలుషిత నీటి సరఫ రా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుడీబజార్, జైన మందిరం, లంబీగల్లీ, బేదర్‌వాడి తదితర ప్రాంతా ల్లో తాగునీరు కలుషితంగా వస్తోందని, ఈ విషయాన్ని జలమండలి డీజీఎం, జీఎం, ఏజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చందన్‌వాడీ, జుమ్మెరాత్ బజార్ ప్రాంతాల్లో ఇదే సమస్యలు ఉండేవని,
ప్రజలు తిరగబడడంతో గతంలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ కల్పించుకొని సమస్యలను పరిష్కరించారని గుర్తుచేశారు. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కలుషిత నీటి సరఫరాతో తాము అనారోగ్యాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధామిస్తున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకుంటే బస్తీవాసులంతా జలమండలి ఎండీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News