Share News

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:03 AM

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల పోలింగ్ మెుదలైంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..
Tamil Nadu Assembly Elections

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల పోలింగ్ మెుదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి దశలో భాగంగా 152 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం 7.04 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ దశలో 3,60,77,310 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.


మరోవైపు తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మెుత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం మెుత్తం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ పోలీసులు పెద్దఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మే 4న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మే 1 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌ కొత్త నిబంధనలు

సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాం

Updated Date - Apr 23 , 2026 | 07:17 AM