Share News

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

ABN , Publish Date - May 20 , 2026 | 12:59 PM

జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు.

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, మే 20: జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు. కులగణన చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. సామాజిక న్యాయ సాధనకు కులగణన కీలకమన్నారు. వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కుల సర్వే విజయవంతమైందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


సుప్రీం కోర్టు తీర్పు చరిత్రాత్మకం: వీహెచ్

v-hanumanth-rao.jpg

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదన్నారు. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. 60 కోట్ల ప్రజలకు న్యాయం చేసిన జస్టిస్ సూర్యకాంత్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారని.. రేవంత్ ప్రభుత్వం కులగణన చేసిందని తెలిపారు. బీసీలు ఎదగడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదని వీహెచ్ విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..

కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్ రెడ్డి భేటీ.. హైదరాబాద్‌లో కీలక ప్రాజెక్టులపై చర్చ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2026 | 01:26 PM