వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై అచ్చెన్నాయుడు సీరియస్
ABN , Publish Date - May 20 , 2026 | 11:31 AM
ఏపీలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, మే 20: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎరువుల కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టాలన్నారు.
రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాల వారీగా ఎరువుల స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ప్రత్యేక బృందాల నిఘా పెంచాలని మంత్రి తెలిపారు. రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు
సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..
Read Latest AP News And Telugu News