Share News

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..

ABN , Publish Date - May 20 , 2026 | 10:33 AM

చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..
NTR district News

ఎన్టీఆర్ జిల్లా, మే 20: చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ మండలంలో ఏపీఎం(అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్)గా గంధం చంద్రశేఖర్ పని చేస్తున్నారు. గొల్లపూడి క్లస్టర్‌లో ఎంఎస్‌సీసీ.. ఎస్‌బీఐ గొల్లపూడి బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంకుల్లో ఫేక్ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు ఇప్పించి, అందిన చోట డబ్బులు వసూలు చేశారని ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు చంద్రశేఖర్ లేఖ రాశారు.


తన పాత్ర ఏమీ లేకపోయినా తనను సస్పెండ్ చేశారని, ఎనిమిది నెలలుగా కొత్త పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ఎవరూ న్యాయం చేయలేదని చంద్రశేఖర్ ఆరోపించారు. సూసైడ్ చేసుకుంటానని మెసేజ్ పంపి చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. చంద్రశేఖర్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

గుంటూరు జిల్లాలో దారుణం.. వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి యువకుడి హత్య..

టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 20 , 2026 | 05:00 PM