Share News

భర్తతో గొడవ.. గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న భార్య

ABN , Publish Date - May 20 , 2026 | 12:43 PM

కుటుంబ కలహాలతో వివాహిత బంటుపల్లి ఇందుమతి (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం సింహాచంలో ఈ ఘటన జరిగింది.

భర్తతో గొడవ.. గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న భార్య
Visakhapatnam news

విశాఖపట్నం, మే 20: విశాఖ సింహాచంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత బంటుపల్లి ఇందుమతి (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలి భర్త బంటుపల్లి మహేశ్‌తో గత రాత్రి గొడవ జరగడంతో ఇందుమతి గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్య ఎంతకీ కనపడకపోవడంతో భర్త గదిలో వెళ్లి చూడగా.. ఇందుమతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇందుమతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.


ఈ ఘటనపై హాస్పటల్ వైద్యులు.. గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి...

వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై అచ్చెన్నాయుడు సీరియస్

హస్తకళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే లక్ష్యం: మంత్రి సవిత

Read Latest AP News And Telugu News

Updated Date - May 20 , 2026 | 12:48 PM