Share News

నేటి నుంచి 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం పర్యటన

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:26 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తారు. ఇందుకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నేటి నుంచి 3 రోజుల పాటు కొడంగల్‌లో సీఎం పర్యటన
CM Revanth Reddy

  • మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌

  • ఎక్స్‌పోను ప్రారంభించనున్న రేవంత్‌

  • రూ.9,053 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

వికారాబాద్‌/హైదరాబాద్‌ నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తారు. ఇందుకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తన పర్యటనలో భాగంగా దుద్యాల మండలం హకీంపేట్‌లో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.9,053 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. అలాగే రూ.46.08 కోట్లతో నిర్మించిన వివిధ ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు.


సీఎం తొలిరోజు పర్యటన అధికారిక షెడ్యూల్‌ మేరకు.. శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ప్రాంగణం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు హకీంపేటకు చేరుకుంటారు. 2.40 నుంచి 3.30 గంటల వరకు రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించి స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత గంట పాటు ఆదర్శ, ప్రగతిశీల రైతులు, శాస్త్రవేత్తలతో సీఎం సమావేశమై ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి చర్చించనున్నారు. అనంతరం గంట పాటు హకీంపేట్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్‌లోని తన నివాసానికి వె ళ్లి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.


సీఎంను కలిసేందుకు కాలినడకన కర్నూలు నుంచి హైదరాబాద్‌కు..!

సీఎం రేవంత్‌రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభిమాని తాయన్న వినూత్న ప్రయత్నం చేశారు. రేవంత్‌ను కలవాలన్న కోరికతో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు కాలినడకన వచ్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో గత నెల 29న పాదయాత్రను ప్రారంభించిన తాయన్న.. 9 రోజుల పాటు ఏకంగా 350 కిలోమీటర్లు నడిచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌ను కలుసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా తాయన్నను సీఎం శాలువాతో సన్మానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:26 AM