Share News

తెలంగాణ క్యాబినెట్ భేటీ.. జనగణనపై కీలక చర్చ

ABN , Publish Date - Feb 23 , 2026 | 07:27 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నారు.

తెలంగాణ క్యాబినెట్ భేటీ.. జనగణనపై కీలక చర్చ
Telangana Cabinet

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ (Telangana Cabinet) సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నారు. అయితే, స్వల్ప అనారోగ్యం కారణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణనపై మంత్రిమండలి భేటీలో కీలక చర్చ జరిగింది. ఈ చర్చలో జనగణన వివరాలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెల్లడించారు. రెండు దశల్లో జనగణన ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో రెండో దశ ప్రారంభం కానుంది. జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గంలో చర్చించారు.


జనగణన-2027 కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మే 11వ తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో జనగణన ప్రక్రియకు 89 వేల మంది సిబ్బందిని నియమించింది. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. జనగణన 2027పై కేబినెట్ నిర్ణయాలని సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నలతో జనగణన హౌస్‌ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను సీఎస్ వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకుంటారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 07:32 PM