Share News

పాతబస్తీలోని మైనారిటీ గురుకులంలో పదేళ్ల బాలుడి అదృశ్యం

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:58 PM

తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడి అదృశ్యం కలకలం రేపింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాతబస్తీలోని మైనారిటీ గురుకులంలో పదేళ్ల బాలుడి అదృశ్యం
minority school boy missing

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడి అదృశ్యం కలకలం రేపింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..


పదేళ్ల షేక్ మహమ్మద్ అనే బాలుడు పాతబస్తీలోని చంద్రాయాణగుట్టలో గల ప్రభుత్వ తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయంలో (టీఎంఆర్‌ఈఐఎస్) ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా.. బాలుడు రెండు రోజులుగా హాస్టల్లో కనిపించక పోవడంపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


లబోదిబోమంటూ చంద్రయాణగుట్ట పోలీసులను బాలుడి తల్లిదండ్రులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా.. బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఫోన్ చేసి తమ బాధను వెల్లగక్కారు. స్పందించిన ఎమ్మెల్యే.. హాస్టల్‌ను సందర్శించి యాజమాన్యంతో మాట్లాడారు. బాలుడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 19 , 2026 | 06:59 PM