సర్కారీ భూ విక్రయాలకు నిరసనగా నేడు హెచ్‌ఎండీఏ ముట్టడి: బీఆర్‌ఎస్
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:25 AM
ప్రజా ప్రయోజనాల కోసం హైదరాబాద్ మహా నగర పరిధిలో సేకరించిన విలువైన ప్రభుత్వ భూముల విక్రయానికి నిరసనగా బుధవారం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనాల కోసం హైదరాబాద్ మహా నగర పరిధిలో సేకరించిన విలువైన ప్రభుత్వ భూముల విక్రయానికి నిరసనగా బుధవారం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ.. వామపక్షాల సహకారంతో నిరసన తెలుపుతామన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీఆర్‌ఎస్ఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు తదితరులు పాల్గొంటారన్నారు.
మియాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్‌పార్క్ సహా నగరంలోని నివాస ప్రాంతాల మధ్య గల విలువైన సర్కారు భూములను ప్రజోపయోగ అవసరాలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా కూకట్‌పల్లి చుట్టూ నివాస ప్రాంతాల మధ్య ట్రక్ పార్కు కోసం సేకరించిన భూములను దాని కోసమే వినియోగించాలని, కాదంటే స్థానికుల ప్రయోజనార్థం మౌలిక వసతుల కల్పనకు వాటిని కేటాయించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News