లోన్ చెల్లించలేక మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Sep 13 , 2026 | 09:46 AM
హైదరాబాద్‌లోని బోరబండలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక ఇందిరానగర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గద్దె పవన్ కుమార్ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బోరబండలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక ఇందిరానగర్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గద్దె పవన్ కుమార్(30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత లోన్ చెల్లించలేక మనస్తాపంతో బాత్‌రూమ్‌లోని షవర్‌కు లుంగీతో ఆయన ఉరివేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించి భార్య, కుటుంబ సభ్యులు తలుపు తెరిచారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్స్‌లో అరుదైన ఘనత.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి
కేసీఆర్.. మాక్ అసెంబ్లీకి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News