Share News

మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:41 AM

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)లో తొలగించిన ఓట్లలో మూడు కోట్లు అక్రమ వలసదారులవేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. వారంతా బంగ్లాదేశ్‌ చొరబాటుదారులని, వారిలో ఒక్కరికీ ఓటు హక్కు దక్కనివ్వబోమని ప్రకటించారు.

మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే
Amit Shah Hyderabad Rally

  • వారిలో ఒక్కరికీ ఓటు హక్కు దక్కనివ్వం

  • ప్రతి చొరబాటుదారుడినీ దేశం నుంచి పంపిస్తాం

  • పది కోట్లు మరణించిన, చిరునామా మారిన వారివి

  • చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్‌

  • ఈవీఎంలు మోసమైతే రేవంత్‌ ఎలా గెలిచారు?

  • 2014, 2019లో ఎస్‌ఐఆర్‌ లేకున్నా గెలిచాం

  • 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లో గెలవలేదా?

  • దమ్ముంటే పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చకు రండి

  • పన్నెండేళ్ల పాలనలో చారాణా కుంభకోణం లేదు

  • హైదరాబాద్‌ ర్యాలీలో అమిత్‌ షా వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)లో తొలగించిన ఓట్లలో మూడు కోట్లు అక్రమ వలసదారులవేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. వారంతా బంగ్లాదేశ్‌ చొరబాటుదారులని, వారిలో ఒక్కరికీ ఓటు హక్కు దక్కనివ్వబోమని ప్రకటించారు. ప్రతి చొరబాటుదారుడినీ ఓటర్ల జాబితా నుంచి, దేశం నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. బోగస్‌ ఓట్లు, చొరబాటుదారుల ఓట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటోందని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ నుంచి మొజంజాహీ మార్కెట్‌ వరకు సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ ముగింపు సభలో ఆయన మాట్లాడారు.


ఆదివారం ఢిల్లీలో జరిగింది ఓట్‌ బచావో ర్యాలీ కాదని, చొరబాటుదారులను కాపాడే ‘ఘుస్‌పైటియా బచావో’ ర్యాలీ అని విమర్శించారు. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ చొరబాటు దారులకు చోటు కల్పించేందుకే ర్యాలీ తీశారని ఆరోపించారు.పది కోట్లు వారివే ఎస్‌ఐఆర్‌లో 13 కోట్ల ఓట్లు తొలగించారన్న రాహుల్‌ ఆరోపణపై స్పందించిన షా.. పది కోట్ల ఓట్లు మరణించిన, చిరునామా మార్చిన, రెండుచోట్ల నమోదైన వారివేనని చెప్పారు. 6.25 కోట్ల మంది వేరేచోట నివాసం ఉంటున్నారని, వారికి రెండుచోట్ల ఓట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. దాదాపు మూడు కోట్ల మంది చనిపోయారని, చనిపోయినవారి ఓట్లు తొలగించాలా, వద్దా? అని నిలదీశారు. ‘సర్‌’ లేకుండానే గెలిచాంఎ్‌సఐఆర్‌ వల్లే బీజేపీ గెలిచిందంటున్న కాంగ్రెస్‌ ఎస్‌ఐఆర్‌కు ముందు చాలా ఎన్నికలు తాము గెలిచిన విషయం గుర్తు చేసుకోవాలని అమిత్‌షా అన్నారు. 2014, 2019లలో ఎస్‌ఐఆర్‌ లేకున్నా మోదీ గెలిచారని చెప్పారు. 2024 తర్వాత మహారాష్ట్ర, హరియాణాలో భారీ మెజారిటీతో గెలిచామని, ఢిల్లీలో ఏళ్ల తర్వాత విజయం సాధించామని, బిహార్‌, అసోంలోనూ గెలిచామని, బెంగాల్‌లో మమతను అధికారం నుంచి తప్పించామని అన్నారు.


Untitled-1 copy.jpgతెలంగాణలోనూ గెలిచి అధికారంలోకి వస్తామని ప్రకటించారు.ఈవీఎంల మోసమైతే.. తాము ఈవీఎంల మోసం చేస్తే రేవంత్‌ సీఎం ఎలా అయ్యారని షా ప్రశ్నించారు. కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా వచ్చిందని, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఎలా వచ్చాయని నిలదీశారు. గెలిస్తే ప్రజల ఓట్లతో, ఓడితే ఈవీఎంల వల్లేనా? అని ప్రశ్నించారు. రాహుల్‌కు ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అమలవుతోందని అమిత్‌షా అన్నారు. అది రేవంత్‌ ద్వారా రాహుల్‌గాంధీకి చేరుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రె్‌సను ఎప్పటికీ క్షమించరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి విస్మరించిందని, అవన్నీ ‘చపాచట్‌’ అయిపోయాయని ఎద్దేవా చేశారు.మాక్‌ పార్లమెంటులోనే ప్రధానిరాహుల్‌గాంధీ మాక్‌ పార్లమెంటులోనే ప్రధాని కాగలరని షా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఆయన విదేశాలకు వెళ్తుంటారని, ఎన్నికల్లో గెలవాలంటే దేశంలో ఉండి చెమటోడ్చాలని చురకలంటించారు. చేతిలో రాజ్యాంగం పెట్టుకుని రాజ్యాంగాన్ని గౌరవించరని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. దమ్ముంటే పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని సవాల్‌ విసిరారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. చర్చలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతారని వ్యాఖ్యానించారు.


పావలా కుంభకోణం కూడా లేదు

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కుంభకోణాలేనని, ఏకంగా రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారని అమిత్‌షా ఆరోపించారు. వారి చేతుల్లో మళ్లీ ప్రభుత్వం పెడదామా? అని ప్రజలను ప్రశ్నించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో పావలా కుంభకోణం కూడా జరగలేదని, మోదీపై ఆరోపణలే లేవని అన్నారు. వెంటిలేటర్‌పై కాంగ్రె్‌సదేశంలో కాంగ్రెస్‌ క్రమంగా కనుమరుగవుతోందని షా వ్యాఖ్యానించారు. తమిళనాడులో 64 ఏళ్లుగా, బెంగాల్‌లో 54 ఏళ్లుగా, గుజరాత్‌, యూపీలో 40 ఏళ్లుగా, త్రిపురలో 26 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో లేదని ప్రస్తావించారు. ఆ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ వల్లే ఓడిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉందని, అది మోదీతో పరిగెత్తలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ యువమోర్చా అధ్యక్షుడు కూడా రాహుల్‌ను ఓడించగలరని అన్నారు. హామీలు నిలబెట్టుకున్నాంఅధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని, రామమందిరం కడతామని, త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేస్తామని చెప్పామని, అన్నీ చేశామని షా ప్రస్తావించారు.


Untitled-1 copy.jpgఆపరేషన్‌ సిందూర్‌, సర్జికల్‌ స్ట్రైక్‌చేశామని, నక్సలైట్లను నిర్మూలించామని చెప్పారు. 2029 డిసెంబరు 31 లోగా దేశాన్ని డ్రగ్స్‌ రహితంగా మారుస్తామని ప్రకటించారు. దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత బీమా, 16 కోట్ల ఇళ్లకు నీళ్లు, 13 కోట్ల మందికి పీఎం కిసాన్‌ నిధి, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల ఉజ్వల గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు.మోదీ ఒక్కరే అడ్డుకోగలరురేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అమ్మడానికి జరుగుతున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌, ఓవైసీ, బీఆర్‌ఎస్‌ అడ్డుకోగలవా? అని అమిత్‌షా ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మాత్రమే ఈ దోపిడీని అడ్డుకోగలరన్నారు. ఎన్‌డీఏ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్‌పై వాస్తవాలు వివరించాలని అమిత్‌షా సూచించారు. తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆ రోజు నిజాం మెడలు వంచకపోతే ఈ రోజు హైదరాబాద్‌ దేశంలో భాగం అయ్యేది కాదని వ్యాఖ్యానించారు. ర్యాలీలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి సభావేదిక నుంచి నమస్కరించారు. అంతకుముందు భారత్‌మాతాకీ జై నినాదాలు చేయించగా సభికులు సరిగా స్పందించక పోవడంతో.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, వద్దా?అనిప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిపెకిలించేలా నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు.

పూజలు చేయడం నా అదృష్టం: షా

భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్థిల్లాలని అమ్మవారిని మనసారా ప్రార్థించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిఇంగ్లిష్‌, తెలుగులోనూ పోస్టు చేశారు.


కాంగ్రెస్‌, ఇండియా కూటమి దుష్ప్రచారం తిప్పికొడతాం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ మహా పాద యాత్రకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు కొనియాడారు. పాదయాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, దేశ రాజ్యాంగబద్థ సంస్థలపైనా కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలు పచ్చి అబద్థాలతో విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టడానికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ గడ్డపై రెండు కిలోమీటర్ల మహా పాదయాత్రలో మనతో కలిసి అడుగులు వేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


భంగపాటు తప్పదు: సంజయ్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్న మహాపాదయాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు తమ వైఖరిని మార్చుకుని సర్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి భంగపాటు తప్పదని బండి సంజయ్‌ హెచ్చరించారు.

అమిత్‌షాను కలిసిన చిరంజీవి

హైదరాబాద్‌ పర్యటనకువచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో అమిత్‌షాను మధ్యాహ్నం భోజన సమయంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌, మైహోం అధినేత రామేశ్వరరావు, గ్రీన్‌కో సంస్థకు చెందిన అనిల్‌ కలిశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:00 AM