Share News

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:18 AM

ప్రజల్లో అవగాహన, వారి భాగస్వామ్యం, అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలను నియంత్రించవచ్చన్న ఆలోచనతో నెల రోజులు సాగిన ‘సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌’ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ తెలిపారు.

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌
Shikha Goel

  • ఏడాదిలో 20.2 శాతం సైబర్‌ నేరాల తగ్గుదల

  • సత్వర ఫిర్యాదులతో పెరిగిన బాధితుల నగదు జప్తు

  • ఈ ఏడాది నేరగాళ్లు దోచిన మొత్తం రూ.881.72 కోట్లు

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో అవగాహన, వారి భాగస్వామ్యం, అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలను నియంత్రించవచ్చన్న ఆలోచనతో నెల రోజులు సాగిన ‘సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌’ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ తెలిపారు. గత నెల ఒకటో తేదీ నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 4,248 సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌లు నిర్వహించి.. 2,78,428 మందికి సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ 24,886 కార్యక్రమాలతో 15,48,905 మందికి అవగాహన కల్పించడంతో దాదాపు 20.2 శాతం సైబర్‌ నేరాలు తగ్గాయ్యాయన్నారు. గతేడాది తెలంగాణలో సైబర్‌ నేరాల ఆర్థిక నష్టం రూ.1,104.42 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.881.72 కోట్లేనన్నారు.


సురక్షా కా తిరంగా, ఆగు, ఆలోచించు, విచారించు వంటి అవగాహన కార్యక్రమాలు, ఫ్రాడ్‌ కా ఫుల్‌ స్టాప్‌ వంటి క్యాచీ స్లోగన్లతో ప్రజల వద్దకు తమ సైబర్‌ వారియర్లు చేరుకున్నారని శిఖా గోయల్‌ తెలిపారు. దీని వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి సైబర్‌ నేరానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేస్తున్నారని, దీంతో వేగంగా స్పందించి సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును స్తంభింప చేయగలుగుతున్నట్లు తెలిపారు. గతేడాది సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లో ఉన్న రూ.183.11 కోట్ల నగదును జప్తు చేయగా, ఈ ఏడాది ప్రజల అవగాహన, సత్వర ఫిర్యాదులతో రూ.260.30 కోట్లు జప్తు చేసి.. బాధితులకు న్యాయం అందివ్వగలిగామన్నారు. రూ.77.19 కోట్ల పెరుగుదల నమోదైందని, ముఖ్యంగా పెట్టుబడి ఆఫర్ల వల్లే అత్యధిక నష్టం వాటిల్లుతుందని, విద్యాధికులే ఎక్కువగా నష్ట పోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బిహారీల అరెస్టు

పటాన్‌చెరు సమీపంలోని కర్ధనూర్‌ గ్రామంలోని గోవిందరావు డైరీ ఫామ్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బిహారీలను ఆదివారం ఈగల్‌ ఫోర్స్‌, పటాన్‌ చెరు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన సంచిత్‌ రాయ్‌, మహేశ్‌ కుమార్‌ గంజాయికి బానిసై.. గంజాయి విక్రయాలు సాగిస్తున్న వీరిద్దరికి.. ఽధూల్‌పేట వాసి కిషన్‌ సింగ్‌ గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించామని తెలిపారు. నిత్యం వీరి వద్ద గంజాయి కొంటున్న 10 మంది గంజాయి కొనుగోలు దారుల్ని గుర్తించామని, వీరికి డ్రగ్‌ టెస్టు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడాదిలో 1000 మంది మహిళల అక్రమ రవాణా!

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:18 AM