ఏడాదిలో 1000 మంది మహిళల అక్రమ రవాణా!
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:58 AM
ఇతర రాష్ట్రాల మహిళలను హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చి అండాలు సేకరించి విక్రయిస్తున్న ముఠాకు సంబంధించిన కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అండాల సేకరణ ముఠా గలీజు దందా
కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠా
8 మంది నిందితులు, పలు ఫెర్టిలిటీ సెంటర్ల ఆర్థిక లావాదేవీలపై ఆరా
పలు ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకుల
అరెస్టుకు రంగం సిద్ధం
హైదరాబాద్ సిటీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల మహిళలను హైదరాబాద్‌కు అక్రమంగా తీసుకొచ్చి అండాలు సేకరించి విక్రయిస్తున్న ముఠాకు సంబంధించిన కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో తిష్ట వేసిన ఈ ముఠా.. గత ఏడాది కాలంలో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన 600 నుంచి 1000 మంది మహిళలను హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేసినట్టు పోలీసు విచారణలో తెలిసింది. అక్రమ రవాణాకు గురైన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది నిందితులు, ముఠాతో సంబంధం ఉన్న ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు.. త్వరలో మరికొందని అరెస్టు చేయనున్నారని సమాచారం.
నిక్కత్ పర్విన్‌కు బెంగాల్‌లో భారీ నెట్‌వర్క్
ఈ ముఠాలోని మధ్యప్రదేశ్, ఇండోర్‌కు చెందిన అమిత్ శర్మ.. అండాల సేకరణలో ప్రధాన పాత్ర షోషించగా.. మహిళల అక్రమ రవాణాలో పశ్చిమబెంగాల్‌కు చెందిన నిక్కత్ పర్విన్ కీలక పాత్ర పోషింనట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగాల్‌కు చెందిన పర్విన్‌కు ఆ రాష్ట్రంలో భారీ నెట్‌వర్క్ ఉంది. ఏజెంట్లు, దళారులతో యువతులు, కడు పేదరికంలో ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు, బిక్షాటన చేస్తున్న మహిళలకు డబ్బు ఆశ చూపి తమ దందాలోకి తెచ్చేవారు. ఈ ఏజెంట్ల మాటలు నమ్మిన మహిళలు డబ్బు కోసం అండాలు ఇచ్చేందుకు వచ్చేవారు.
అయితే, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, వారి అనుమతితోనే అండాలు సేకరిస్తున్నట్టు పత్రాలు తయారు చేసి ఈ ముఠా దందా చేసింది. దందాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రతి విడతలో సుమారు 50 మంది మహిళలను హైదరాబాద్‌కు తెచ్చి.. వారిని వేర్వేరు హాస్టల్స్‌లో ఉంచేవారు. ఇందుకోసం ఒక్కో వసతి గృహానికి ఈ ముఠా రూ.50 వేలు అద్దెగా చెల్లించినట్టు తెలిసింది. ఇక, మహిళల నుంచి సేకరించిన అండాలను ఈ ముఠా.. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, గుజరాత్‌లోని నగరాలకు రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకరైన పంకజ్ సోనీ.. గతంలోనూ ఇదే తరహా కేసులో అరెస్టయ్యాడు. సికింద్రాబాద్ ప్రాంతంలో రహదారిపై నిద్రించే పేదలు, బిచ్చగాళ్లకు మద్యం, బిర్యానీ ఇచ్చి వారి నుంచి వీర్యాన్ని సేకరించి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ కేంద్రాలకు విక్రయించేవాడు.
ఆర్థిక లావాదేవీలపై ఆరా..
ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఆ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఓ మహిళ నుంచి సేకరించిన అండాలను రూ.3లక్షలకు విక్రయించిన నిందితులు. మహిళలకు హార్మోన్ ఇంజక్షన్‌లు ఇచ్చి పదిసార్లు అండాలు సేకరింనట్లు పోలీసులు గుర్తించారు. అంటే ఒక్కో మహిళ నుంచి సేకరించిన అండాలతో రూ.30లక్షలు కొల్లగొట్టారు. ఇలా ఏడాదిలో సుమారు 1000 మంది మహిళల నుంచి ఎన్ని అండాలు సేకరించారు..? ఎన్ని కోట్లు కొల్లగొట్టారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఈ ముఠాతో సంబంధమున్న ఫెర్టిలిటీ కేంద్రాలపైనా పోలీసులు దృష్టి సారించారు. సీపీ సుమతి ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే పలు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ కేంద్రాలపై దాడి చేసి, ఈ ముఠాతో సంబంధమున్న వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి పోలీసు అధికారుల నివాళి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News