బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి పోలీసు అధికారుల నివాళి
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:53 AM
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి పలువురు సీనియర్, విశ్రాంత ఐపీఎస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి పలువురు సీనియర్, విశ్రాంత ఐపీఎస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. అమెరికా నుంచి ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విమానాశ్రయంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాష్ట్ర భద్రతా సలహాదారు, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ఎన్ఎస్ మాజీ డీజీ సుదీప్ లఖ్టాకియా, డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, డీజీపీ సీఐడీ ఏసీబీ చారు సిన్హా, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐజీ కాంతి రాణా టాటా, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, శంషాబాద్ డీసీపీ రాజేశ్ తదితరులు హాజరై దివంగత అధికారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన నిబద్ధతతో కూడిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలోనే కాకుండా రవాణా రంగంలోనూ ఆయన ప్రవేశపెట్టిన విశిష్ఠ సంస్కరణలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News