హైదరాబాద్‌లో ఏసీబీ రైడ్స్.. వాటిపై అధికారుల ఫోకస్..
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:24 PM
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు (ACB Raids) కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) సోదాలు చేశారు. ఏసీబీ చేస్తున్నదాడులు స్థానికంగా పెను సంచలనం సృష్టించాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కా సమాచారంతో...
కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోనల్ కార్యాలయంలోని పలు విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు వ్యూహాత్మకంగా ఈ సోదాలు చేపట్టారు. సోదాల్లో భాగంగా ఏసీబీ బృందం ప్రధానంగా పలు అంశాలపై దృష్టి సారించింది.
టౌన్ ప్లానింగ్..
భవన నిర్మాణ అనుమతులు, అక్రమ కట్టడాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను వసూళ్లు, మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ సంబంధిత ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. మున్సిపాలిటీలో జరిగిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో అవినీతి జరిగిందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచాారం.
కార్యాలయంలోకి నో ఎంట్రీ.
సోదాలు జరుగుతున్న సమయంలో కార్యాలయం లోపలికి ఎవరినీ అనుమతించడం లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందిని ఏసీబీ బృందం వేర్వేరుగా విచారిస్తోంది. ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత ఎంత మంది అధికారులు ఈ అక్రమాల్లో భాగస్వాములయ్యారు, ఎంత మేర అవినీతి జరిగింది అనే విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు పూర్తి నివేదికను సిద్ధం చేసిన తర్వాత అరెస్టులు లేదా సస్పెన్షన్లు ఉండే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News