చలికాలంలోనూ.. తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:21 AM
వేసవి రావడానికి మరో 4 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రజలకు ఈ సారి చాలా ముందస్తుగా తాగునీటి కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెరిగిన ట్యాంకర్ల బుకింగ్
హైదరాబాద్: వేసవి రావడానికి మరో 4 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రజలకు ఈ సారి చాలా ముందస్తుగా తాగునీటి కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ట్యాంకర్ల బుకింగ్ దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. కొన్ని నెలల తరువాత కనిపించాల్సిన ఈ పరిస్థితి. ఈ సారి మరింత ముందుగానే ప్రారంభం కావడం ఆందోళనకు గురిచేస్తుంది. ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని ఊహించినా ఇంత ముందుగా ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుందని జలమండలి అధికారులు ఊహించలేదు. వేసవిలో కనిపించిన డిమాండ్ ప్రస్తుతం నవంబరులో పెరిగింది. అల్వాల్ సర్కిల్ పరిధిలో కొన్ని రోజుల నుంచి ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది.
డిమాండ్ పెరిగింది..
అల్వాల్ సర్కిల్ పరిధిలో 29 వేల నీటి కనెక్షన్‌లు ఉన్నాయి. నీటి సరఫరాలో అంతరాయంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతోంది. ప్రసుత్తం 150 ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయి.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం, తుర్కపల్లి, హెచ్‌ఎంటీ కాలనీ, వెంకటాపురం, భూదేవినగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి.
ట్యాంకర్ల బుకింగ్ పెరిగింది
అల్వాల్ సర్కిల్ పరిధిలో ప్రతి రోజు దాదాపు 150 ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయి. మచ్చబొల్లారం, తుర్కపల్లి గ్రౌం డ్ వాటర్ లేని ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఫిల్లింగ్ కేంద్రాలు నడిపిస్తున్నాం. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే ఏ విధంగా సరఫరా చేయాలన్నదానిపై జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తాం.
వెంకటేశ్వర్లు, జలమండలి డీజీం
ఈ వార్తలు కూడా చదవండి:
సాఫీగా.. వేగంగా.. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు
జనవరి 2నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News