లాభాల ఆశ చూపి కోట్లలో టోకరా.. రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:28 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయంటూ ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను బురిడీ కొట్టించి ఏకంగా రూ.6.55 కోట్లను కాజేశారు.
హైదరాబాద్, నవంబరు 28: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయంటూ ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను బురిడీ కొట్టించి ఏకంగా రూ.6.55 కోట్లను కాజేశారు.
ఎస్.ఆర్. నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.4.50 కోట్లు, కూకట్‌పల్లికి చెందిన మరో రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.2 కోట్లను స్వాహా చేశారు. అధిక లాభాల ఆశ చూపుతూ బాధితులను నమ్మించిన కేటుగాళ్లు.. మొదట పెట్టుబడులపై భారీ లాభాలు వచ్చినట్లు నమ్మించారు. దీంతో బాధితులు వారి మాటలు నమ్మి దఫదఫాలుగా కోట్లాది రూపాయలను వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.6.55 కోట్లను కొల్లగొట్టి సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు.
నమ్మించి నట్టేట ముంచిన కేటుగాళ్లు..
బాధితుల నుంచి సేకరించిన డబ్బును సైబర్ నేరగాళ్లు ఒకే ఖాతాలో ఉంచకుండా విడతల వారీగా ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. పెట్టుబడులపై లాభాలు వస్తున్నాయన్న భ్రమలో బాధితులు మరింత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడంతో మోసం కోట్లకు చేరింది. చివరకు తాము పెట్టిన సొమ్మును తిరిగి పొందే పరిస్థితి లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పదవీ విరమణ అనంతరం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీవితకాల సంపాదనను కోల్పోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ వచ్చే ప్రకటనలు, వాట్సాప్ సందేశాలు, అపరిచిత వ్యక్తుల సూచనలను నమ్మవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పేరుతో వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు బదిలీ చేయవద్దని, అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..
ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?