భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:52 AM
భారతీయ కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ యూట్యూబ్ చరిత్రలో తొలిసారిగా 10 లక్షల మంది పెయిడ్ ఛానల్ మెంబర్స్‌ను సొంతం చేసుకున్న వ్యక్తిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ యూట్యూబ్ చరిత్రలో తొలిసారిగా 10 లక్షల మంది పెయిడ్ ఛానల్ మెంబర్స్‌ను సొంతం చేసుకున్న వ్యక్తిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూట్యూబ్ తన బ్లాగ్‌పోస్టులో వెల్లడించింది. గతేడాది ఇండియా గాట్ లేటెంట్ షో కాంట్రవర్సీతో సమయ్ రైనా కొంత వెనకపడ్డప్పటికీ మళ్లీ కోలుకుని ఈ మైలురాయిని అధిగమించాడు.
తన కంటెంట్ ఆధారంగానే ఆడియన్స్‌ను సమయ్ రాబట్టుకోగలిగాడని గూగుల్ ఇండియా కితాబునిచ్చింది. చదరంగం సంబంధిత వీడియోలు, ఆ తరువాత గ్రాండ్‌మాస్టర్స్‌తో పిచ్చాపాటీ మాటల షో తరువాత ఇండియా గాట్ లేటెంట్ అనే పాప్యులర్ ఆన్‌లైన్ షోతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడని తెలిపింది.
తమ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్లు అందించే కంటెంట్ కోసం డబ్బులు చెల్లించే ట్రెండ్ భారతీయుల్లో అంతకంతకూ పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో దాదాపు 10.2 లక్షల మంది కనీసం ఒక యూట్యూబ్ ఛానల్‌కు డబ్బు చెల్లించి మెంబర్‌షిప్ తీసుకున్నారు. భారతీయ క్రియేటర్లకు మెంబర్‌షిప్ ఆధారిత ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే 25 శాతం మేర పెరిగింది.
ఇక రైనా యూట్యూబ్ ఛానల్‌లో ప్రస్తుతం మూడు రకాల మెంబర్‌షిప్‌లు ఉన్నాయి. ‘సమయ్‌కీ దోస్తు’ ప్లాన్ కోసం నెలకు రూ.59 చెల్లించాలి. ‘సమయ్ కా ఖాస్’ కోసం నెలకు రూ.599, ‘సైలెంట్ సపోర్టర్’ మెంబర్‌షిప్ కోసం నెలకు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇండియా గాట్ లేటెంట్ షోలో మరో పాడ్‌కాస్టర్ రనవీర్ అల్లాబాదియా కామెంట్స్ కారణంగా సమయ్ కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారు క్షమాపణ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?
ఇన్‌స్టా పోస్ట్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన మెటా సంస్థ..