Share News

ఎండుతున్న వరి పొలాలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:53 PM

పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి.

ఎండుతున్న వరి పొలాలు
P P Rao Project

  • అధ్వానంగా పీపీరావు ప్రాజెక్టు కాలువలు

  • ఆందోళనలో రైతులు

దహెగాం(మంచిర్యాల): పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. దహెగాం మండలం కల్వాడ గ్రామ శివారులోని పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టులో నిండా నీరు ఉన్నా నిష్పప్రయోజనంగా మారింది. ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని వదిలిన కల్వాడ సంత సమీపంలో కాల్వపై నుంచి సాగునీరు వృథా గా పోతోంది.


సాగునీరు అందక కుంచవెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, బామనగర్‌ తదితరులు సాగు చేసి వరి పంటలు సాగునీరు అందక పోవడంతో వరి పొలాలు బీటలు బారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2003 సంవత్సరం నుంచి పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు ద్వారా సాగునీరు రైతులకు సాగు నీరు అందుబాటులోకి వచ్చింది. ప్రధాన ఎడమ కాల్వ ద్వారా దహెగాం మండలంలోని వివిధ గ్రామాల్లోని 9వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రధాన కుడి కాల్వ ద్వారా మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలం లింగాల, చింతపుడి గ్రామాలకు 2వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన లక్ష్యంగా ఉంది.


zzzz.jpgజూలై చివరి నాటికి వర్షాలు కురువ డంతో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీరు నిండింది. దీంతో రైతులు ప్రధాన ఎడమ కాల్వ కింద, హత్తి, పీపీ రావు కాలనీ, కల్వాడ, కుంచవెల్లి, చంద్రపల్లి, బామ నగర్‌, పీకలగుండం తదితర గ్రామాల్లోని రైతులు వరి పంటను సాగు చేశారు. వరి నాట్లు పూర్తి అయి నెల రోజులు కావడంతో రైతులు ఎరువులు కూడా చల్లారు. ప్రస్తుతం సాగునీరు అందక పొలాలు బీటలు పారుతున్నాయని గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పట్టించు కోకపోతే వరి పొలాలు ఎండి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కల్వాడ తండా వద్ద..

దహెగాం మండలంలోని కల్వాడ తండా వద్ద ప్రధాన ఎడమ కాల్వ నుంచి సాగునీరు వృథాగా పోతోంది. అధికారులు పట్టించుకోక పోవడంతో కుంచ వెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, బామనగర్‌, ఓడ్డుగూడ, బ్రాహ్మణ్‌ చిచ్చాల గ్రామాల్లో సాగుచేసిన వరి పంటకు సాగునీరు అందటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వృథాగా పోతున్న ప్రాజెక్టు నీటిని అడ్డుకట్ట వేస్తేనే తమకు పొలాలకు సాగునీరు అందుతుందని పలువురు గ్రామాల రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పొలాలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.


పదిహేను రోజులుగా నీరు రావడం లేదు..

  • దుర్గం కేదారి, పీకలగుండం

పదిహేను రోజులుగా పొలాలకు ప్రాజెక్టు నీరు రావడం లేదు. రెండో సారి ఎరువులు కూడా వేశాం. నీరు అందక పోవడంతో పొలాల బీటలు బారుతు న్నాయి. అధికారులు, నాయకులు పట్టించుకొని సాగు నీరు అందేలా చూడాలి.

Updated Date - Oct 03 , 2026 | 01:53 PM