ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ భవనంలో ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:20 PM
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అంకుశాపూర్ అంగన్వాడీ భవనంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనం స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడిపడ్డాయి.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అంకుశాపూర్ అంగన్వాడీ భవనంలో ఈరోజు (మంగళవారం) ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనం స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోపాటు సహా ఐదుగురికి గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News