పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:51 PM
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘వైభవ్ ఆడుతున్న షాట్లు అద్భుతం. పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు. వయస్సే అతడి బలం. ప్రత్యర్థి ఎవరనేది కూడా పట్టించుకోకుండా విధ్వంసం సృష్టిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ భయం లేకుండా ఆడుతున్నాడు. కాబట్టే ఇలాంటి సంచలనాలు నమోదు అవుతున్నాయి’ అని సునీల్ గావస్కర్.. వైభవ్ సూర్యవంశీని ప్రశంసించాడు. అయితే గావస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ జట్లకు సవాలుగా మారాయి. 14 ఏళ్ల వయసులోనే గతేడాది ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. ఆడిన మూడో మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి ఆరు గెలిచిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్