సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:29 AM
రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డొనొవాన్ ఫెరీరా(52*) చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్‌కు ఫెరీరా క్షమాపణ చెబుతున్న వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ప్రీతి జింటా టీమ్ గెలిచిందా?’.. 2014లో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పెట్టిన ఈ పోస్ట్ తాజాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఈ పోస్ట్‌పై చర్చ జరుగుతుంది. అయితే మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ సీజన్‌లో తమ తొలి ఓటమిని నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డొనొవాన్ ఫెరీరా(52*) చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్‌కు ఫెరీరా క్షమాపణ చెబుతున్న వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రీతి జింటా సహ యాజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ టీమ్ ఐపీఎల్ 2014లో క్వాలిఫయర్ 1లో కేకేఆర్‌పై ఓడింది. అప్పుడు సల్మాన్ ఖాన్.. ‘జింటా టీమ్ గెలిచిందా..?’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు ఆర్ఆర్ బ్యాటర్ ఫెరీరా ఇప్పుడు ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. ‘ప్రీతి జింటా టీమ్ నేడు గెలవలేదు’ అనే అర్థంలో ‘సారీ భాయ్.. ఆజ్ నహీ’ అంటూ సరదాగా సల్మాన్ ఖాన్‌కు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన
మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్