Share News

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:55 AM

మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ స్టార్ మహిళా టీ20 బ్యాటర్ స్మృతి మంధాన మరింత కిందకి వెళ్లింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఒక స్థానం కోల్పోయిన స్మృతి.. 747 పాయింట్లతో ఐదో ర్యాంకు సాధించింది.

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఇందులో ప్రపంచ స్టార్ మహిళా టీ20 బ్యాటర్ స్మృతి మంధాన మరింత కిందకి వెళ్లింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఒక స్థానం కోల్పోయిన స్మృతి.. 747 పాయింట్లతో ఐదో ర్యాంకు సాధించింది. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా మహిళలు.. ఇటీవల 5 టీ20ల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. అందులో 4-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయారు. భారత ప్లేయర్ల పేలవ ప్రదర్శన ఐసీసీ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. భారత్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ 786 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది.


అగ్రస్థానంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ జార్జియా వాల్(815) తన స్థానానికి పదిలపర్చుకోగా, రెండో స్థానంలో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ(788) కొనసాగుతోంది. షెఫాలీ వర్మ 729 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 646 పాయింట్లతో పదో స్థానానికి ఎగబాకింది. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్ స్టార్ బౌలర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎకల్‌స్టన్(727), లారెన్ బెల్(714) ఉన్నారు. టీమిండియా స్టార్ బౌలర్ దీప్తి శర్మ ఒక ర్యాంక్ మెరుగై 713 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శ్రీచరణి(681), రేణుకా సింగ్ ఠాకూర్(676) 11, 12వ స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో టాప్ 10 స్థానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అగ్రస్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్(508) ఉంది. హేలీ మ్యాథ్యూస్(483), దీప్తి శర్మ(357) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిన బాబర్

Updated Date - Apr 29 , 2026 | 10:55 AM