Share News

జీవిత కథను వ్యాపారంగా మార్చుకున్నారు.. కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై విమర్శలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:59 PM

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల ఓ ఐస్‌క్రీమ్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో కాంబ్లీ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.

జీవిత కథను వ్యాపారంగా మార్చుకున్నారు.. కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై విమర్శలు
Vinod Kambli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల ఓ ఐస్‌క్రీమ్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో కాంబ్లీ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. ఈ యాడ్‌లో ఐస్‌క్రీమ్ కోన్‌ను సింబాలిక్‌గా చూపిస్తూ.. కాంబ్లీ దృఢ సంకల్పం, కమ్‌బ్యాక్‌ను ఉద్దేశిస్తూ ఐస్‌క్రీమ్ యాడ్‌ను రూపొందించారు.


కాంబ్లీ క్రికెట్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ జీవితంలో ‘కొంచెం తక్కువ’ పొందినవారు ‘కొంచెం ఎక్కువ’ పొందడానికి అర్హులు అనే కాన్సెప్ట్‌తో యాడ్‌ను చిత్రీకరించారు. అయితే ఈ యాడ్ కాన్సెప్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంబ్లీ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సింపుల్ మార్కెటింగ్ సందేశంగా మార్చడం సరైంది కాదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సింపథీని ఎక్కువగా ఉపయోగించి భావోద్వేగాలను వాణిజ్యంగా మార్చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదంపై సదరు యాడ్ క్రియేటివ్ టీమ్ సభ్యుడు గుంజన్ గాబా స్పందించాడు. ‘95శాతం మంది ప్రేక్షకులు ఈ యాడ్‌ను ప్రశంసించారు. కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ కాంబ్లీ కమ్ బ్యాక్‌ను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ చేశాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

Updated Date - Apr 29 , 2026 | 02:16 PM