Share News

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

ABN , Publish Date - May 18 , 2026 | 03:49 PM

చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. 12 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన సీఎస్కే.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే నాకౌట్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెపాక్ స్టేడియం వేదికగా సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇక్కడే రిటైర్‌మెంట్ ఇచ్చేస్తాడని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.


‘కండరాల గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోని ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ధోని పునరాగమనం చాలా కష్టమైంది. అతడు దాదాపు ఏడాది నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే సన్‌రైజర్స్‌పై గెలిచి తీరాల్సిందే. ఇలాంటి కీలక సమయంలో ఫిట్‌నెస్ లేని ఒక ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం చాలా రిస్క్. అతడు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ రియల్ టైమ్ గేమ్ ఆడలేదు. ఇలాంటి ముఖ్యమైన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు కూర్పును మార్చి ధోని మైదానంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. అభిమానిగా నేను కూడా ధోని ఆడాలని కోరుకుంటా. అతడు మైదానంలోకి దిగితే ఎవరికి మాత్రం చూడాలని ఉండదు! కానీ అతడు తన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకున్నట్లు అనిపించడం లేదు. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని ఆడకపోవడమే మంచిది. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమై.. అతడు బరిలోకి దిగితే మాత్రం అందరికీ సర్‌ప్రైజ్ అవుతుంది’ అని గావస్కర్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

Updated Date - May 18 , 2026 | 04:05 PM