తొలి బెర్త్ బెంగళూరుదే
ABN , Publish Date - May 18 , 2026 | 02:59 AM
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు దూసుకు పోయిన...
ప్లేఆఫ్స్ చేరిన చాంపియన్
23 పరుగులతో పంజాబ్ ఓటమి
ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు దూసుకు పోయిన తొలి జట్టుగా నిలిచింది. వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్) బ్యాటింగ్‌లో, రసిఖ్ సలామ్ (3/36) బౌలింగ్‌లో చెలరేగిన వేళ 23 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని బెంగళూరు మరింత పటిష్టం చేసుకుంది. వరుసగా ఆరో పరాజయం దరిమిలా పంజాబ్ కింగ్స్ నాకౌట్ దారులు దాదాపు మూసుకుపోయాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 222/4 స్కోరు చేసింది. కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), పడిక్కళ్ (45) సత్తా చాటారు. చివర్లో టిమ్ డేవిడ్ (28) బ్యాట్ ఝళిపించాడు. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 199/8 స్కోరుకే పరిమితమై ఓడింది. శశాంక్ సింగ్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), కనోలీ (37), స్టొయినిస్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37), సూర్యాన్ష్ (35) రాణించారు. రసిఖ్ సలామ్ మూడు, భువనేశ్వర్ రెండు వికెట్లు తీశారు. వెంకటేశ్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
భువి, రసిఖ్ దెబ్బకు..: భారీ ఛేదనలో భువనేశ్వర్, రసిఖ్ సలామ్ పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. డ్యాషింగ్ ఓపెనర్లు ప్రియాన్ష్ (0), ప్రభ్‌సిమ్రన్ (2)ను భువీ, కెప్టెన్ శ్రేయాస్ (1)ను రసిఖ్ అవుట్ చేయడంతో పంజాబ్ నాలుగు ఓవర్లలో 19/3తో నిలిచింది. ఈ దశలో కనోలీ, సూర్యాన్ష్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగి నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. కనోలీని పెవిలియన్ చేర్చిన షెఫర్డ్..కింగ్స్‌కు ఝలకిచ్చాడు. తర్వాత సూర్యాన్ష్, స్టొయినిస్, ఆపై శశాంక్ దూకుడుగా ఆడి పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చేందుకు శతథా యత్నించారు. కానీ రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో ఫలితం లేకపోయింది.
వెంకటేశ్, కోహ్లీ జోరు: అంతకుముందు వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ, పడిక్కళ్ బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశారు. బెథెల్ (11) త్వరగా పెవిలియన్ చేరినా..కోహ్లీ, పడిక్కళ్ రెండో వికెట్‌కు చకచకా 76 పరుగులు జోడించారు. అర్ధ శతకానికి చేరువలో పడిక్కళ్ అవుటైనా..కోహ్లీ, వెంకటేశ్ మూడో వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. ఈక్రమంలో విరాట్ ఐపీఎల్‌లో 67వ హాఫ్ సెంచరీ పూరించాడు. కోహ్లీ నిష్క్రమించాక టిమ్ డేవిడ్ జతగా వెంకటేశ్ బెంగళూరు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
స్కోరుబోర్డు
బెంగళూరు: బెథెల్ (బి) హర్‌ప్రీత్ 11, కోహ్లీ (సి) ఆర్యా (బి) చాహల్ 58, పడిక్కళ్ (సి) శ్రేయాస్ (బి) హర్‌ప్రీత్ 45, వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 73, టిమ్ డేవిడ్ (సి) హర్‌ప్రీత్ (బి) అర్ష్‌దీప్ 28; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 222/4; వికెట్లపతనం: 1-21, 2-97, 3-157, 4-222; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-43-1, ఒమర్జాయ్ 4-0-38-0, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-35-2, ఫెర్గూసన్ 3-0-43-0, చాహల్ 3-0-42-1, శశాంక్ సింగ్ 2-0-20-0.
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 0, ప్రభ్‌సిమ్రన్ (సి) పడిక్కళ్ (బి) భువనేశ్వర్ 2, కనోలీ (సి) బెథెల్ (బి) షెఫర్డ్ 37, శ్రేయాస్ (సి) జితేశ్ (బి) రసిఖ్ 1, సూర్యాన్ష్ (సి) కోహ్లీ (బి) సుయాష్ 35, స్టొయినిస్ (ఎల్బీ) హాజెల్‌వుడ్ 37, శశాంక్ సింగ్ (సి) కోహ్లీ (బి) రసిఖ్ 56, ఒమర్జాయ్ (సి) డేవిడ్ (బి) రసిఖ్ 14, హర్‌ప్రీత్ (నాటౌట్) 5 ; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 199/8; వికెట్లపతనం: 1-1, 2-18, 3-19, 4-62, 5-93, 6-160, 7-194, 8-199; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-38-2, హాజెల్‌వుడ్ 4-0-36-1, రసిఖ్ సలామ్ 4-0-36-3, సుయాష్ శర్మ 4-0-50-1, షెఫర్డ్ 1-0-8-1, క్రునాల్ 3-0-27-0.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?