Share News

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

ABN , Publish Date - May 17 , 2026 | 04:03 PM

చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ముగియనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే చెన్నై హోం గ్రౌండ్ చెపాక్ వేదికగా మే 18న సీఎస్కే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ధోని బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌తో పాటు.. ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ధోనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే కీలక పోరులో ధోని ఆడనున్నట్లు సమాచారం. అయితే ఆ మ్యాచ్‌లో ఆడి.. చెపాక్‌లో ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని కథనాలు వస్తున్నాయి. వాటిపై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో సర్‌ప్రైజ్‌ను చూసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చెపాక్ వేదికగా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం వచ్చినా నేనేమీ అనుకోను’ అని భోగ్లే విశ్లేషించాడు. దీంతో ధోని రిటైర్‌మెంట్ వార్తలకు మరింత బలం చేకూరింది.


ఇదిలా ఉంటే, ఎస్ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం. అందులో నెగ్గితేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఆ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కూడా అంతే కీలకం. గుజరాత్ టైటాన్స్‌పై ఎస్ఆర్‌హెచ్ అనూహ్యంగా 82 పరుగులు భారీ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే.. లఖ్‌నవూ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

థాయ్‌లాండ్ ఓపెన్ 2026: ఫైనల్లో భారత్ ఓటమి

Updated Date - May 17 , 2026 | 04:03 PM