థాయ్‌లాండ్ ఓపెన్ 2026: ఫైనల్లో భారత్ ఓటమి
ABN , Publish Date - May 17 , 2026 | 02:39 PM
థాయ్‌లాండ్ ఓపెన్ 2026 బ్మాడ్మింటన్ టోర్నీ ఫైనల్ పోరులో భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టికి షాక్ తగిలింది. ఈ జోడీ ఫైనల్‌లో ఇండోనేషియా చేతిలో ఓటమిని చవి చూసి రన్నరప్‌గా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ ఓపెన్ 2026 బ్మాడ్మింటన్ టోర్నీ ఫైనల్ పోరులో భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టికి షాక్ తగిలింది. అద్భుతమైన ప్రదర్శనలతో ఫైనల్‌కు చేరుకున్న ఈ జోడీ తుది మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేషియా ప్లేయర్లు లియో రోలీ కర్నాండో-డానియల్ మార్తిన్ జోడీ వరుస సెట్లలో విజయం సాధించింది. 12-21, 23-25 తేడాతో సాత్విక్-చిరాగ్ ద్వయం ఓటమి పాలైంది. అజేయ ప్రదర్శనలతో మూడో టైటిల్‌ను నెగ్గుదామని భావించిన భారత్‌కు.. ఈ ఓటమితో నిరాశే మిగిలింది.
53 నిమిషాల పాటు జరిగిన తొలి సెట్‌లో ఇండోనేషియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించి సులువుగా గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థుల దూకుడు ముందు భారత జోడీ సాత్విక్-చిరాగ్ నిలవలేకపోయారు. పెద్దగా పోటీ లేకుండానే 21-12 తేడాతో తొలి సెట్‌ను ఇండోనేషియా కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్ మాత్రం హోరాహోరీగా సాగింది. భారత ద్వయం చివరి వరకూ పోరాడారు. ఈ సెట్‌ను గెలిచి రేసులోకి వద్దామని భావించినప్పటికీ.. లియో రోలీ కర్నాండో-డానియల్ మార్తిన్ పట్టు విడవలేదు. చివరికి 23-25 తేడాతో సెట్‌ను, టైటిల్‌ను భారత జోడీ కోల్పోయి రన్నరప్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి