Share News

సాకేత్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

ABN , Publish Date - May 17 , 2026 | 04:47 AM

తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని కర్ణాటక ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో డబుల్స్‌ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ సాకేత్‌/నికి పూనాచ ....

సాకేత్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

బెంగళూరు: తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని కర్ణాటక ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో డబుల్స్‌ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ సాకేత్‌/నికి పూనాచ 6-2, 6-3తో బిరుకోవ్‌ (రష్యా)/గ్రిగోరియ్‌ (కజకిస్థాన్‌) జంటను ఓడించి టైటిల్‌ అందుకుంది. వైజాగ్‌కు చెందిన సాకేత్‌కు ఇది కెరీర్‌లో 21వ ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌.

Updated Date - May 17 , 2026 | 04:47 AM