Share News

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - May 16 , 2026 | 09:21 PM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 247 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: విజృంభించిన కోల్‌కతా బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
KKR vs GT

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 247 పరుగులు చేసింది. గుజరాత్‌కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ జీటీ బౌలర్లపై విరుచుపడ్డాడు. 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, 10 సిక్సర్లతో ఏకంగా 93 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.


అంగ్‌క్రిష్ రఘువంశీ(82*; 44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్(52*; 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రఘువంశీకి ఈ సీజన్‌లో ఇది ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఓపెనర్, కెప్టెన్ అజింక్య రహానె(14) మరోసారి విఫలమయ్యాడు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, సాయి కిషోర్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 09:21 PM