ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
ABN , Publish Date - May 16 , 2026 | 07:11 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే గుజరాత్ 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. కాగా కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 8వ స్థానంలో ఉంది. ఈ పోరులో కేకేఆర్ ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే!
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, సిరాజ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, రాహుల్ తెవాటియా, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, ఫిలిప్స్
కేకేఆర్ తుది జట్టు
అజింక్య రహానె(కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), గ్రీన్, మనీశ్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబె, కార్తిక్ త్యాగి
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: పావెల్, రమన్‌దీప్ సింగ్, తేజస్వి దాహియా, మతీశా పతిరణ, వైభవ్ అరోరా
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి