థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
ABN , Publish Date - May 16 , 2026 | 03:17 PM
థాయ్‌లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ పోరులో మలేషియా జోడీ గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌పై 19-21, 22-20, 21-16 తేడాతో సాత్విక్-చిరాగ్ విజయం సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ పోరులో మలేషియా జోడీ గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌పై 19-21, 22-20, 21-16 తేడాతో సాత్విక్-చిరాగ్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ సీజన్‌లో తొలి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న జోడీగా నిలిచారు.
ప్రపంచ నంబర్ 4 ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ 19-21, 22-20, 21-16 తేడాతో మలేషియాపై గెలుపొందింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సాత్విక్-చిరాగ్ జోడీ అద్భుత పోరాట పటిమ కనబర్చింది. ఈ విజయంతో మలేషియా జోడీపై తమ హెడ్-టు-హెడ్ రికార్డును 8-2కు మెరుగుపరుచుకుంది. పీవీ సింధు, లక్ష్యసేన్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో భారత్ ఆశలన్నీ ఈ జోడీపైనే ఉన్నాయి. తొలి సెట్‌ను మలేషియా ప్లేయర్లు గో జెఫీ- నూర్ ఇజ్జుద్దీన్ 20-19 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ రెండో సెట్‌ను 22-20తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌ను తేల్చే మూడో సెట్‌లో విజయం కోసం ఇరు జట్లూ తీవ్రంగా శ్రమించాయి. అయితే సాత్విక్-చిరాగ్ జోడీ దూకుడు ప్రదర్శించి 21-16తో సెట్‌ను గెలిచి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ చేతిలో ఓటమి తర్వాత సహచరులకు రుతురాజ్ బిగ్ మెసేజ్
కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి