అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. నఖ్వీ హాజరవ్వరు!
ABN , Publish Date - May 16 , 2026 | 08:38 PM
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రత్యక్షంగా అహ్మదాబాద్‌కు రావడం లేదని నివేదికలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ సమావేశాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రత్యక్షంగా అహ్మదాబాద్‌కు రావడం లేదని నివేదికలు వెల్లడించాయి. నఖ్వీ ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నట్లు సమాచారం. కాగా ఈ సమావేశాలు ఈ నెల 30-31 తేదీల్లో జరగనున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో నఖ్వీ ఇండియాకు వస్తారా? అనే చర్చ మొదలైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన భారత్‌కు రావడం లేదని స్పష్టమైంది. అయితే ఏ కారణాల వల్ల అయినా ప్రత్యక్షంగా హాజరుకాలేదని సభ్యులకు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనే అవకాశం ఐసీసీ నిబంధనల్లో ఉంది. ఇదిలా ఉంటే ఐసీసీ సమావేశాలు జరిగే సమయంలోనే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ పోరు జరగనుంది. అయితే ఆ మ్యాచ్‌కు నఖ్వీకి ఆహ్వానం అందిందనే ప్రచారం కూడా జరిగింది. దీనికి కూడా తెరపడింది. ఆయనకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని సమాచారం.
ఇవి కూడా చదవండి:
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి