ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
ABN , Publish Date - May 17 , 2026 | 04:42 PM
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా 5,500 పరుగులకు పైగా చేసిన ఒకే ఒక్క బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న కీలక పోరులో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరూ అందుకోని ఘనతను సాధించాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా 5,500 పరుగులకు పైగా చేసిన ఒకే ఒక్క బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ ఈ ఫీట్ అందుకోవడానికి కేవలం 7 పరుగుల దూరంలో నిలిచాడు. ధర్మశాలలో జరుగుతోన్న మ్యాచ్‌లో అజ్మతుల్లా బౌలింగ్‌లో సిక్సర్ బాది.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 5,500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కానీ వారిద్దరూ పలు ఫ్రాంచైజీల తరఫున ఈ ఘనత సాధించారు. కోహ్లీ మాత్రం ఆర్సీబీ తరఫునే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
మరో రికార్డు..
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచులో కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ 500కి పైగా పరుగులు చేశాడు. దీంతో 9 ఐపీఎల్ సీజన్లలోనూ 500 ప్లస్ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. డేవిడ్ వార్నర్ 7, కేఎల్ రాహుల్ 7, శిఖర్ ధావన్ 5 సీజన్లలో ఈ ఘనత సాధించి కోహ్లీ తరువాతి స్థానాల్లో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
థాయ్‌లాండ్ ఓపెన్ 2026: ఫైనల్లో భారత్ ఓటమి