ఢిల్లీ పోటీలోనే..
ABN , Publish Date - May 18 , 2026 | 03:04 AM
లీగ్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన జట్లకు ప్లేఆఫ్స్ ముంగిట ఉత్కంఠ తప్పడం లేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. దీంతో రాజస్థాన్...
నేటి మ్యాచ్
చెన్నై X హైదరాబాద్
వేదిక: చెన్నై, రా.7.30
రాహుల్, పోరెల్ హాఫ్ సెంచరీలు
రాజస్థాన్‌కు హ్యాట్రిక్ ఓటమి
స్టార్క్‌కు నాలుగు వికెట్లు
న్యూఢిల్లీ: లీగ్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన జట్లకు ప్లేఆఫ్స్ ముంగిట ఉత్కంఠ తప్పడం లేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. దీంతో రాజస్థాన్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో కనబర్చిన ఢిల్లీ 5 వికెట్లతో గెలిచింది. అంతేకాకుండా 12 పాయింట్లతో అక్షర్ సేన తమ ఆశలను సజీవంగానే ఉంచుకొంది. మిగిలిన ఏకైక మ్యాచ్‌లో గెలవడం ఢిల్లీకి తప్పనిసరి. ఆ తర్వాత పంజాబ్, చెన్నై, రాజస్థాన్ ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (40 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) రాణించారు. మిచెల్ స్టార్క్‌కు నాలుగు.. మాధవ్ తివారి, ఎన్‌గిడిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ (42 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 56), అభిషేక్ పోరెల్ (31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఆర్చర్, బ్రిజేశ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా స్టార్క్ నిలిచాడు.
ఓపెనర్ల అండతో..: ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రాహుల్, పోరెల్ అర్ధసెంచరీలతో అండగా నిలిచారు. అయితే పది ఓవర్లలో 100 రన్స్ దాటిన ఢిల్లీ ఆటతీరు ఆ తర్వాత నెమ్మదించింది. తొలి వికెట్‌కు 105 రన్స్ జోడించాక పోరెల్ వెనుదిరిగాడు. అనంతరం సాహిల్ (9), రాహుల్ వేగంగా వికెట్లు కోల్పోవడంతో అక్షర్, స్టబ్స్ (4) నిదానంగా ఆడారు. చివర్లో హిట్టర్లు స్టబ్స్, మిల్లర్ (9) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ అశుతోష్ (5 బంతుల్లో 18 నాటౌట్) ధనాధన్ బౌండరీలతో మరో నాలుగు బంతులుండగానే మ్యాచ్ ముగిసింది.
ఆఖర్లో తడబాటు: టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ (12) విఫలమైనా మిగతా టాపార్డర్ బ్యాటర్లు చెలరేగారు. వీరి ధాటికి ఓ దశలో 14 ఓవర్లలోనే 160/2 స్కోరుతో ఉన్న రాజస్థాన్ 200+ సులువుగా సాధిస్తుందనిపించింది. కానీ పేసర్ స్టార్క్ ధాటికి కుదేలైంది. చివరి ఆరు ఓవర్లలో 33 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. మరోవైపు తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లతో జోరు చూపిన జైస్వాల్ రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వైభవ్ మాత్రం అదరగొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అతడు.. స్టార్క్ ఓవర్‌లోనూ 4,6తో ఆకట్టుకున్నాడు. ఇక ఐదో ఓవర్‌లో 4,4,4,6తో 18 రన్స్ అందించాడు. అటు జురెల్ ఆరో ఓవర్‌లో 4,6,4తో దూకుడు ప్రదర్శించడంతో, పవర్‌ప్లేలో జట్టు 75/1 స్కోరుతో నిలిచింది. కానీ పేసర్ మాధవ్ తన తొలి ఓవర్‌లోనే వైభవ్ వికెట్ తీయడంతో రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం పరాగ్ ఫటాఫట్ బ్యాటింగ్ సాగించాడు. అక్షర్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన అతను పేసర్ ముకేశ్ ఓవర్‌లో 6,4,6,6తో 23 పరుగులు రాబట్టాడు. ఈ జోరుతో పరాగ్ 23 బంతుల్లోనే తన ఫాస్టెస్ట్ ఫిఫ్టీని పూర్తి చేశాడు. కానీ 15వ ఓవర్‌లో స్టార్క్ ఝలక్ ఇస్తూ పరాగ్, ఫెరీరా (0), రవి సింగ్ (4)ల వికెట్లు తీశాడు. పరాగ్-జురెల్ మధ్య మూడో వికెట్‌కు 72 పరుగులు సమకూరాయి. ఆ తర్వాత మరింతగా తడబడిన రాజస్థాన్ చివరి 30 బంతుల్లో 27 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అర్ధసెంచరీ చేసిన జురెల్ చివరి ఓవర్‌లో వెనుదిరిగినా వేగంగా ఆడలేకపోయాడు.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) ఎన్‌గిడి 12, వైభవ్ (సి) మిల్లర్ (బి) మాధవ్ తివారి 46, జురెల్ (ఎల్బీ) ఎన్‌గిడి 53, పరాగ్ (సి) అక్షర్ (బి) స్టార్క్ 51, ఫెరీరా (సి) అక్షర్ (బి) స్టార్క్ 0, రవి సింగ్ (ఎల్బీ) స్టార్క్ 4, శుభమ్ దూబే (సి) త్రిపురాన విజయ్ (బి) మాధవ్ తివారి 5, షనక (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 10, ఆర్చర్ (నాటౌట్) 2, మిల్నే (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 193/8; వికెట్ల పతనం: 1-19, 2-89, 3-161, 4-161, 5-165, 6-173, 7-187, 8-191; బౌలింగ్: స్టార్క్ 4-0-40-4, ఎన్‌గిడి 4-0-24-2, త్రిపురాన విజయ్ 2-0-29-0, ముకేశ్ 2-0-40-0, మాధవ్ తివారి 4-0-27-2, అక్షర్ 4-0-31-0.
ఢిల్లీ: అభిషేక్ (సి) ఫెరీరా (బి) బ్రిజేశ్ 51, రాహుల్ (బి) షనక 56, సాహిల్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 9, అక్షర్ (నాటౌట్) 34, స్టబ్స్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 4, మిల్లర్ (సి) షనక (బి) బ్రిజేశ్ 9, అశుతోష్ (నాటౌట్) 18, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 19.2 ఓవర్లలో 197/5; వికెట్ల పతనం: 1-105, 2-122, 3-133, 4-153, 5-175; బౌలింగ్: ఆర్చర్ 4-0-35-2, మిల్నే 3.2-0-41-0, బ్రిజేశ్ 4-0-44-2, షనక 3-0-29-1, యశ్‌రాజ్ 4-0-29-0, ఫెరీరా 1-0-16-0.
1
ఓ ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువ సిక్సర్లు (44) బాదిన భారత బ్యాటర్‌గా వైభవ్. అభిషేక్ (2024లో 42)ను దాటాడు.
2
ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు (8) 500+ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా రాహుల్. విరాట్ కోహ్లీ (9) టాప్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?