Share News

షమీని జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది: రవి శాస్త్రి

ABN , Publish Date - Oct 19 , 2026 | 08:38 PM

టీమిండియా క్రికెట్ దిగ్గజం రవి శాస్త్రి షమీకి మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు.

షమీని జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది: రవి శాస్త్రి
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల తర్వాత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి అవకాశాలు రాకపోవడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న షమీని ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం రవి శాస్త్రి కూడా షమీకి మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు.


‘టీమిండియాకు ఇప్పుడు అనుభవం ఉన్న ప్లేయర్లు అవసరం. అనుభవానికి ప్రత్యామ్నాయం అంటూ ఉండదు. భువనేశ్వర్ కుమార్‌ లాంటి నాణ్యమైన బౌలర్‌ను ఎంపిక చేయడం సహజమైన నిర్ణయం. ఐపీఎల్‌లో అతడు చూపిన ఫామ్, భారత జట్టు తరఫున ఆడిన అనుభవం.. న్యూజిలాండ్ పరిస్థితులకు అతడిని సరైన బౌలర్‌గా నిలబెడతాయి. అదే సమయంలో షమీ విషయంలోనూ సెలక్టర్లు ఆలోచించాలి. షమీ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే వైట్, రెడ్ బాల్స్‌తో తనను తాను నిరూపించుకున్నాడు. టెస్టు, వన్డే జట్లలోకి తిరిగి రావడానికి అతడు చేయాల్సినవన్నీ చేశాడు. ఇప్పుడు షమీని జట్టులోకి తీసుకోవడం అవసరం’ అని రవి శాస్త్రి స్పష్టం చేశాడు.


2025 మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. తొలుత గాయంతో ఆటకు దూరమైన అతడు.. కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్ 2026లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు ప్రకటించిన జట్లలోనూ అతడి పేరు లేకపోవడంతో మరోసారి నిరాశ ఎదురైంది.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

Updated Date - Oct 19 , 2026 | 08:39 PM