Share News

ఐపీఎల్ 2027: ఎంఐ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా!

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:35 AM

రోహిత్‌ శర్మకు డిప్యూటీగా ఉండేందుకు ఎంఐ ఫ్రాంచైజీ సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సంప్రదించినట్లు సమాచారం. అయితే వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను బుమ్రా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2027: ఎంఐ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా!
Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో పలు కీలక మార్పులు చేస్తోంది. హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవ్వడంతో.. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు తిరిగి జట్టు పగ్గాలు అందించింది. దీంతో మూడేళ్ల తర్వాత మళ్లీ హిట్‌మ్యాన్ ఎంఐకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే రోహిత్‌కు డిప్యూటీగా ఉండేందుకు ఎంఐ ఫ్రాంచైజీ సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సంప్రదించినట్లు సమాచారం. అయితే వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను బుమ్రా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.


అక్టోబర్ మొదటి వారంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం బుమ్రాను సంప్రదించి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని కోరిందట. అయితే అందుకు బుమ్రా అంగీకరించలేదని సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి బుమ్రా చెప్పిన కారణాలేంటన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. 2013లో ఐపీఎల్ డెబ్యూ చేసిన బుమ్రా.. అప్పటి నుంచి ఎంఐతోనే కొనసాగుతున్నాడు. తాజాగా మళ్లీ రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టడంతో కెప్టెన్ అయ్యే చివరి అవకాశం చేజారినట్లు భావిస్తుండటమే బుమ్రా నిర్ణయానికి కారణమని చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026లో తొలిసారి బుమ్రాకు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ హార్దిక్ పాండ్య, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో బుమ్రా జట్టు పగ్గాలు చేపట్టాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ.. అధికారిక ప్రకటన విడుదల

వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్

Updated Date - Nov 28 , 2026 | 07:36 AM