హ్యాట్రిక్‌కు మరో అడుగే
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:07 AM
వరుసగా మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను సొంతం చేసుకొనేందుకు ఆతిథ్య భారత మహిళలు ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచారు.
జూఫైనల్లో భారత్ జూచైనాతో అమీతుమీ నేడే
మహిళల ఆసియా చాంపియన్స్
ట్రోఫీ హాకీ
భోపాల్: వరుసగా మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను సొంతం చేసుకొనేందుకు ఆతిథ్య భారత మహిళలు ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మనోళ్లు 6-2తో మలేసియాను చిత్తు చేశారు.
దీపిక సెహ్రావత్ (25, 30 ని.) రెండు గోల్స్‌తో మెరవగా, ముంతాజ్ (10 ని.), నవ్‌నీత్ కౌర్ (18 ని.), సునేలితా టోపో (33 ని.), ఇషికా (57 ని.) మిగిలిన నాలుగు గోల్స్ సాధించారు. నూర్ అజర్ (27 ని.), నురామిర్ (52 ని.) మలేసియాకు గోల్స్ అందించారు. మరో సెమీస్‌లో జపాన్‌పై చైనా గెలిచింది. శనివారం జరిగే తుదిపోరులో చైనాను భారత్ ఢీకొంటుంది.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!