ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:54 PM
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాడివి అయి ఉండి ఇంత ఓవరాక్షన్ అవసరమా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో భారత్ 'ఎ' జట్టు ప్రయాణం ముగిసింది. గురువారం దోహాలో జరిగిన సెమీ-ఫైనల్‌లో శ్రీలంక 'ఎ' చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ సేన 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేయగా... శ్రీలంక 'ఎ' కేవలం 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లసిత్ క్రూస్‌పుల్లే (116), సినెత్ జయవర్ధనే (105) సూపర్ సెంచరీలతో శ్రీలంక 'ఎ' జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు టీమిండియా పేసర్ హర్షిత్ రాణాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఏడు ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 61 పరుగులు ఇచ్చి.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. అయితే, తన బౌలింగ్‌లో లంక బ్యాటర్ బంతిని బౌండరీకి తరలించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ బంతిని అందుకోవడంలో కాస్త ఆలస్యం చేశాడు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్.. షాబాజ్‌ను దూషించాడు. తొందరగా బంతి అందుకో అంటూ పరుష పదజాలం వాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు హర్షిత్ రాణా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘మరీ ఇంత ఆటిట్యూడ్ పనికి రాదని.. అంతర్జాతీయ స్థాయి ఆటగాడివి అయి ఉండి ఇంత ఓవరాక్షన్ అవసరమా?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సాటి ఆటగాడిని తిట్టడం సరికాదని.. ఆటిట్యూడ్ తప్ప హర్షిత్ దగ్గర ఇంకేమీ లేదని విమర్శిస్తున్నారు. బీసీసీఐ ఈ విషయంలో జోక్యం చేసుకుని హర్షిత్‌ను మందలించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ 2026లో హర్షిత్ రాణా నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 26 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 217 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక 2024లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 24 ఏళ్ల హర్షిత్.. ఇప్పటి వరకు రెండు టెస్టుల్లో 4, 14 వన్డేల్లో 26, 14 టీ20 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ
అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం