ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:43 PM
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది.
విజయవాడ, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ 23 పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ కౌంటింగ్ ముగిసిన వెంటనే ఫలితాల వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, ఎన్నికల సిబ్బందితోపాటు పోలీసు శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 1,009 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మొత్తం 24,98,312 మంది ఓటర్లకుగాను 15,85,031 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 63.44 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా మార్కాపురం జిల్లా పొదిలిలో 77.90 శాతం, ప్రకాశం జిల్లా కందుకూరులో 76.67 శాతం పోలింగ్ నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 75.20 శాతం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో 74.65 శాతం, బాపట్లలో 70.78 శాతం పోలింగ్ జరిగింది.
అత్యల్పంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో 54.67 శాతం, తాడిగడపలో 56.37 శాతం, గూడూరు (N)లో 56.66 శాతం పోలింగ్ నమోదైంది.
రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 57.01 శాతం, కాకినాడ కార్పొరేషన్లో 58.59 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగిత్యాలలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
సుప్రీంకోర్టు కొలీజియంపై మాజీ సీజేఐ బి.ఆర్.గవాయ్ అసంతృప్తి.. రాష్ట్రపతికి లేఖ